కాణిపాకం గెస్ట్ హౌస్ క్వారంటైన్ సెంటరా?

* మాజీ సి ఎస్ ఐ.వై. ఆర్. మండిపాటు 
* చెప్పులతో గెస్ట్ హౌస్ లో కరోనా బాధితులు నడుస్తున్న వీడియో వైరల్ 
* విషయాన్ని తేలిగ్గా తీసుకున్న డీ జీ పీ కార్యాలయం

హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారం జరుగుతోందనే విషయం ఇప్పటికే రచ్చ రచ్చ అయింది. అయినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రఖ్యాత కాణిపాకం ఆలయంలో అన్యమతస్తులకు ఏపీ ప్రభుత్వం వసతి ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనను ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐవైఆర్ అన్నారు.

ఇది ఆలయ ప్రాంగణమా? లేక వసతి సదుపాయమా? అని నిలదీశారు. ఇంకెక్కడా వసతి సదుపాయమే లేనట్టు... దీన్ని అన్యమతస్తుల కోసమే వాడుతుండటంలో అంతరార్థం ఏమిటని మండిపడ్డారు. ఇతర మతస్తులను ఆలయ ప్రాంగణంలోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ప్రాంగణం నుంచి అన్యమతస్తులు వెలుపలకు వస్తున్న వీడియోను షేర్ చేశారు. అయితే, డీ జీ పీ కార్యాలయం మాత్రం ఆలయం గెస్ట్ హౌస్ ను క్వారంటైన్ సెంటర్ చేయటం లో తప్పేమీ లేదన్నట్టు ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసి చేతులు దులిపేసుకుంది.