కంగనా కూడా పెట్టేసింది
Published on: Fri Sep 6, 2013 11:26AM

ఈమధ్య కాలంలో కొందరు హీరో, హీరోయిన్స్, సెలబ్రిటీలు సొంతంగా ఓ వెబ్‌సైట్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇటీవలే సల్మాన్ కూడా మీడియాలో తనపై వస్తున్న వార్తల్ని తిప్పికొట్టేందుకు ఓ వెబ్‌సైట్ పెట్టుకున్నాడు. అదే విధంగా అదే జాబితాలోకి మరో హీరోయిన్ కూడా చేరిపోయింది. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కూడా అఫిషియల్‌కంగనారనౌత్.కామ్ పేరిట సొంతంగా ఒక వెబ్‌సైట్ ను ఏర్పాటు చేసుకుంది. తనకు సంబంధించిన మూవీ అప్‌డేట్స్, ఫ్యాషన్ ఈవెంట్స్, పర్సనల్ ప్రొఫైల్ వంటి అన్ని వివరాలని ఆ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. దీనివల్ల తన అభిమానులకు దగ్గర అవడంతో పాటుగా తనపై వస్తున్నా రూమర్స్ కి స్వస్తి పలకొచ్చు అని భావిస్తుందట.


