TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కందుకూరు రూటే సపరేటు

Published on: Sat Mar 3, 2012 10:20AM

కందుకూరు: సహజంగా ప్రకాశంజిల్లా గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఈ జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ గ్రూపు ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఈ గ్రూపులు చేస్తున్న గోలతో అన్ని పార్టీల నాయకులు తలలు పట్టుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేకపాటి రాజమోహనరెడ్డి రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో నెల్లూరు లోక్ సభ కు జరిగే ఉప ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది జిల్లాలోనే కాక రాష్ట్రస్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. కందుకూరు ఎన్నికలు రాష్ట్ర మంత్రి మహీధర్ రెడ్డికి సవాలుగా మారాయి. గత ఎన్నికల్లో అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభకు కాంగ్రెస్ అభ్యర్ధులకే మెజారిటీ వచ్చింది. అప్పట్లో మహీధర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీచేశారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో గెలుపు బాధ్యత అంతా సిఎం ఆయనపైనే ఉంచారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ మహీధర్ రెడ్ది ఆదినారాయణరెడ్డి ఇక్కడనుంచి స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొందారు. 1994 ఎన్నికల్లో కూడా  రాష్ట్రంలో టిడిపి ప్రభావం బాగా ఉన్నప్పటికీ మహేధర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి సుమారు ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి 5వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నియోజకవర్గంలో మానుగుంట, దివి వర్గాల మధ్య గ్రూపుల ప్రభావం నేటికీ కొనసాగుతుంది. ఇక్కడ అగ్రవర్ణాల్లో కమ్మ సాగసామాజిక వర్గం, ఆ తరువాత రెడ్డి సామాజిక వర్గం స్థానికంగా దళిత వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ గ్రూపుల ప్రభావాల కారణంగానే గత ఎన్నికల్లో కేవలం మూడువేల పైచిలుకు ఓట్లతో మాత్రమే మహీధర్ రెడ్డి గెలుపొందారు.