జయేంద్ర సరస్వతి శివైక్యం
Published on: Wed Feb 28, 2018 9:57AM

తమిళనాడులోని సుప్రసిద్ధ కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం చెందారు. ఆయన వయసు 82 సంవత్సరాలు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. జయేంద్ర సరస్వతిని కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రికి తరలించారు. ఆయన ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం సఫలం కాకపోవడంతో.. జయేంద్ర సరస్వతి శివైక్యం చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 1935 జూలై 18న తంజావూరు జిల్లాలోని ఇరుల్ నీకిలో జన్మించిన జయేంద్ర సరస్వతి అసలు పేరు.. సుబ్రమణ్య మహాదేవ.. 1954 మార్చి 22న కంచి పీఠంలో చేరిన ఆయన జయేంద్ర సరస్వతిగా.. 69వ పీఠాధిపతిగా సేవలందించారు. కంచి పీఠం తరపున అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టారు.. జయేంద్రుని మరణంతో కాంచీపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


