ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు!
Published on: Fri Oct 4, 2024 1:21PM

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రులలో భాగంగా రెండో రోజు అయిన శుక్రవారం అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో కోలాహలం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హరినాథ్, జస్టిస్ దుర్గాప్రసాద్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), సీపీ రాజశేఖర్‌బాబు తదితరులు ఈ రోజు
అమ్మవారి దర్శనం చేసుకున్నారు.


