TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తోక ముడుస్తున్న షబ్బీర్ అలీ

Published on: Mon Feb 20, 2012 8:59AM

కామారెడ్డి ఉప ఎన్నికల్లో పోటీకి నై
హైదరాబాద్ : షబ్బీర్ అలీ ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ప్రతిపాత్రుడు. మంత్రిగా ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది రూపాయలు అర్జించుకున్నారు. గతంలో పదవులకోసం మందున్న షబ్బీర్ అలీ ప్రస్తుతం కామారెడ్డి శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీకి నిలబడమంటే వెనకా ముందూ ఆడుతున్నారు. గత ఉపఎన్నికల్లో పొరుగు నియోజకవర్గమైన ఎల్లారెడ్డికి వలసపోయి పోటీచేసిన షబ్బీర్ అలీ ఇప్పుడు మాత్రం ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి వేస్తున్నారు. సొంత నియోజకవర్గమైన కామారెడ్డి సీటు ఖాళీ అయినందుకు సంతోషపడాలో, తెలంగాణా సెంటిమెంట్ ను చూసి వెనక్కి తగ్గాలో తేల్చుకోలేక పోతున్నారు. ఇప్పటికే ఆయన 2009 సార్వత్రిక ఎన్నికలు, 2010 ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. బాన్సువాడ, నిజామాబాద్ అర్బన్ ఎల్లారెడ్డి తరహా ఎన్నికల ఫలితాలు కామారెడ్డిలో పునరావృతం అయితే తీవ్ర నష్టం జరుగుతుందనే ఆందోళన ఆయనలో నెలకొంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసేకంటే అధిష్టానం అనుగ్రహం పొంది నామినేటెడ్ పదవి తీసుకోవడమే మేలనే అభిప్రాయం షబ్బీర్ అలీ మదిలో ఉన్నట్లు తెలుస్తోంది.