నాది, రజనీది ఒకటే లక్ష్యం...

 

తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్... విలక్షణ నటుడు కమల్ హాసన్ రజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు తమ రాజకీయాల గురించి కమల్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. చెన్నై ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన ఆయన... రజనీకాంత్‌, తన లక్ష్యం ఒకటేనని.. తమిళనాడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ఆశయమని అన్నారు. రాష్ట్రంలోని కొన్ని సమస్యలు పరిష్కరించేందుకు కేవలం మాటలు సరిపోవని... రజనీ చెప్పినట్లు రాష్ట్రంలో ఆధ్యాత్మిక రాజకీయాలు సాధ్యమవుతాయో లేదో కానీ, రాష్ట్రాభివృద్ధి మాత్రం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. త్వరలో నిర్వహించనున్న స్ధానిక ఎన్నికల్లో పోటీ చేయాలో వద్దో నిర్ణయించేందుకు కార్యకర్తలతో సమావేశమవుతానని ఆయన చెప్పారు.