Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎట్టకేలకు కమల్ హాసన్ ద ఎంపీ
posted on: Jun 13, 2025 4:07PM
.webp)
తొలి నుంచి కమల్ హాసన్ ది ద్రవిడ నాస్తిక వాదం. అది బై బ్లడ్ అలా వచ్చిందా అన్నది తెలీదు కానీ ఆయన దక్షిణాదిలోనే ఏఎన్నార్ తర్వాత నాస్తికవాదంలో అగ్రగణ్యుడు. బేసిగ్గా సినిమాల్లో ఉంటే వారు తప్పక అపర భక్తులై ఉంటారు. దళితులైనా సరే భక్తిపారవశ్యంలో మునిగి తేలుతుంటారు. ఉదాహరణ ఇళయారాజా, జేసుదాసు. జేసుదాసు మరీ.. తాను హిందూ కాకున్నా ఇక్కడి దేవీ దేవతలంటే విపరీతమైన భక్తి భావంతో ఉంటారు. ఆలయంలోకి రానివ్వకున్నా సరే ఆయన.. బయటే నిలబడి గురువాయూరప్పను విశేషంగా కొలుస్తుంటారు.
అలాంటి ఫీల్డ్ లో ఉండి కూడా తొలి నుంచి కమల్ నాస్తిక వాదంతోనే ఉండేవారు. బేసిగ్గా కమల్ ది తమిళ బ్రాహ్మణ అయ్యర్ కుటుంబం. తండ్రి శ్రీనివాస అయ్యర్ న్యాయవాది. ఆయన కూడా అంతే. తన పిల్లలందరికీ హాసన్ అనే ముస్లిం నేమ్ పెట్టడంలోనూ ఇదే విప్లవాత్మక ధోరణి. తన ముస్లిం ఆప్తమిత్రుడి జ్ఞపకార్ధంగా ఆయన తన పిల్లలకు హాసన్ అన్న పేరు పెట్టినట్టుగా చెబుతారు. అందుకే చారు హాసన్, కమల్ హాసన్ అన్న పేర్లు.
ఇవే లక్షణాలను పుణికిపుచ్చుకున్న కమల్ రజనీకి ఎంతెంతో భిన్నం. తమిళనాట నెత్తికి ఎంతగా విభూతి పట్టీలు పెట్టుకున్నా సరే ద్రవిడ వాదం వినిపిస్తేనే రాజకీయాల్లో రాణించగలం. కన్నడ బార్న్, మరాఠా బేస్డ్ రజనీ.. తనది ఆధ్యాత్మిక రాజకీయమని అన్నారు. అయినా సరే ఆయన రాజకీయాల్లోకి రాలేక ఆమడ దూరంలోనే ఆగిపోయారు. అదేమంటే ఆరోగ్య సమస్యలుగా చెప్పారు. అదే కమల్ గెలిచినా ఓడినా ముందుకైతే దూకేశారు. కోయంబత్తూరులో ఒక మహిళ చేత ఓడిపోయారు కూడా.
అలాగని రాజకీయాలకు దూరమయ్యారా అంటే లేదు. మొన్నటికి మొన్న కన్నడ భాషకు సంబంధించిన సంచలన కామెంట్లు చేస్తూ.. మక్కల్ నీతి మయ్యం... అంటే ప్రజల నీతి కోసం పుట్టిన పార్టీ. ఇక్కడ నీతి న్యాయం అందివ్వడమే తన ధ్యేయం. ఏది నిజమో అదే మాట్లాడుతానంటూ స్ట్రైట్ ఫార్వర్డ్ నెస్ ని ఫాలో అవుతున్నారు. గతంలో కమల్ హాసన్ దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలు ద్రవిడ వాదం గొడుగులోకి రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడి భాషలు కూడా తెలుగు- తమిళ- మలయాళ- కన్నడ అంటూ అన్నీ ద్రవిడ భాషలే అంటూ దక్షిణాది భావన రెచ్చగొట్టే యత్నం చేశారు.
దానికి తోడు ద్రవిడ మున్నెట్ర కగజం పార్టీకి రాజ్యసభలో అంత పెద్ద కళా సాహిత్య రంగాలకు చెందిన నాయకత్వం లేదు. పార్టీ వాయిస్ కానీ దక్షిణాది వాయిస్ గానీ వినిపించేంత గొప్ప లీడర్షిప్ లేదు. ఇప్పటికే కేంద్రంతో భాషా గొడవల నుంచి, నీట్, రూపాయి గుర్తు వంటి ఎన్నో సమస్యలున్నాయి. ఇలాంటి వాటికి ఇంటర్నేషనల్ ఫిగర్ అయిన కమల్ హాసన్ అయితే ఇటు పార్టీకి కూడా అండగా ఉంటారని డీఎంకే భావిస్తున్నది.
వచ్చే ఎన్నికల్లో విజయ్, అన్నాడీఎంకే, బీజేపీలు ఏకమై ముందుకెళ్లే పరిస్థితి ఉంది. కరుణానిధి చనిపోయాకు డీఎంకేకి ఒక సినిమాపర్సనాల్టీ లేదు. అటు అన్నాడీఎంకేకి విజయ్ ఎలా తోడు అవుతున్నారో.. ఇటు కమల్ ద్వారా డీఎంకేకి ఒక సినీ ముఖ చిత్రం ఉండటం మంచిదిగా భావించిన స్టాలిన్ ఈ దిశగా కమల్ ని దగ్గరకు చేర్చినట్టు తెలుస్తోంది.. ఏది ఏమైనా సొంత పార్టీ ద్వారా సాధించలేనిది.. సొంత ద్రవిడ విధానం ద్వారా ఏంపీ కాగలిగిన కమల్ హాసన్ కి శుభాకాంక్షలు


.webp)



