TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేను కొట్టలేదండి బాబోయ్...

Published on: Tue Nov 28, 2017 11:47AM


చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ఏం లాభం.. ఇప్పుడు కమల్ హాసన్ పరిస్థితి అలానే ఉంది మరీ. వివాదాలకు కాస్త దూరంగా ఉండే కమల్.. తాను ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తున్నా అని ప్రకటించాడో కానీ... అప్పటినుండి కావాలని వివాదాల్లో తల దూరుస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ కి వ్యతిరేకంగా విమర్శలు చేయడం.. పార్టీ పైన చేస్తే చేయోచ్చు.. ఏకంగా హిందుత్వంపై కామెంట్లు చేసి పెద్ద రచ్చ చేశాడు. ఆ తరువాత ఏదో ఒక అంశంపై స్పందిస్తూ విమర్శిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు.

 

అదేంటంటే.. ఇటీవల కమల్ ఓ పబ్లిక్ ఈవెంట్ కు వెళ్లాడు. అయితే సాధారణంగా తమ అభిమాన హీరో వస్తే అభిమానులు అత్యుత్సాహం చూపిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఓ అభిమాని కమల్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. సెక్యూరిటీ అతన్ని అడ్డుకున్నా... ఆ అభిమాని మాత్రం కమల్‌ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో.. ఆగ్రహంతో కమల్ ఒక్కసారిగా అభిమాని చేయి తీసి  కొట్టినంత పని చేశాడు. అంతే ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. కమల్ ను బద్నాం చేసేస్తున్నారు కొంతమంది. అభిమానులను కమల్‌ కొట్టడంపై కొందరు తీవ్ర స్థాయిలో ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు. అభిమానంతో దగ్గరకు వచ్చిన వ్యక్తిని అలాగేనా కొట్టేది అంటూ సోషల్‌ మీడియాలో జనాలు కమల్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై స్పందించిన కమల్ తాను అతడిని కొట్టలేదు అంటూ చెప్పుకొస్తున్నాడు. అతడు తన కాళ్లపై పడేందుకు ప్రయత్నించాడు అని, అందుకే అతడిని వద్దని వారించాను తప్ప, అతడిపై చేయి చేసుకోలేదు అంటూ ఏదో కవరింగ్ ఇస్తున్నాడు కానీ... వీడియోలో ఉన్న ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే మాత్రం అలా లేదని అందరికీ అర్ధమవుతుంది. మొత్తానికి కమల్ రాజకీయాల్లోకి రాకముందే ఇలా ఉంటే వచ్చిన తరువాత ఇంకెలా ఉంటుందో...