TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కమల్ కూడా మాట్లాడేశారు

Published on: Tue Nov 3, 2015 2:06PM

 

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా మత అసహనంపై మాట్లాడారు, మత అసహనం పెరగడం మంచిదికాదన్న కమల్... దేశం మరోసారి విచ్ఛిన్నం కారాదని వ్యాఖ్యానించారు, మత విద్వేషాల కారణంగా దేశం ఒకసారి చీలిపోయిందని, మరోసారి అలా కాకూడదని కమల్ హాసన్ అన్నారు, ఆనాడు దేశం చీలకుండా ఉండి ఉంటే... ఈనాడు ప్రపంచంలో పెద్ద దేశంగా, మరింత శక్తివంతంగా ఉండేదని కమల్ అభిప్రాయపడ్డారు. తనకు అన్ని మతాలు సమానమేనన్న కమల్ హాసన్... మతపరమైన సమస్యలు దేశానికి మంచిదికాదన్నారు