కమల్ హాసన్ కాంగ్రెస్ తో చేతులు కలుపుతున్నాడా?

 

కమల్ హాసన్.. పరిచయం అవసరంలేని నటుడు.. తన నటనతో, సినిమాలతో ప్రేక్షకులని అలరించిన కమల్ 'మక్కల్ నీధి మయ్యమ్' అనే పార్టీని స్థాపించారు.. పార్టీ రిజిస్ట్రేషన్ అంశం గురించి ఢిల్లీ వెళ్లిన కమల్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు.. దీంతో కమల్ కాంగ్రెస్ తో చేతులు కలుపుతున్నారా? వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు తెలుపుతారా? అంటూ గుసగుసలు మొదలయ్యాయి.. అయితే కమల్ మాత్రం రాహుల్ గాంధీని మర్యాద పూర్వకంగానే కలిశానని, తమిళనాడు రాజకీయాల గురించి చర్చించామని అన్నారు.. ఈ పర్యటనలో భాగంగా కమల్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కూడా కలిశారు.. ఒకేసారి ఇద్దరు నేతల్ని కలవడంతో కమల్ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి పెట్టారని విశ్లేషకులు అంటున్నారు.. చూద్దాం కమల్ భవిష్యత్తులో ఏం చేస్తారో.