అలా కాకపోతేనే రజనీతో పొత్తు..

 

ఎన్నో అనుమానాలు... ఎన్నో సస్పెన్స్ ల మధ్య రజకీ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు పార్టీ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఆతరువాత కమల్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు ఈ మధ్య అడపాదడపా ఇద్దరూ ఒకే వేదికపై కనిపిస్తున్నారు కూడా. దీంతో ఇద్దరూ పొత్తు పెట్టుకుంటారేమో అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇక ఈ విషయమే రజనీని అడిగితే...  కాలమే బదులిస్తుందని ఆయన బదులిచ్చారు.ఇదే విషయాన్ని కమల్ దగ్గర ప్రస్తావించగా.. ఆయన అనూహ్య రీతిలో స్పందించారు. రజనీ రంగు కాషాయం కాకపోతేనే పొత్తు ఉంటుంది. లేకపోతే ఆ అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఇద్దరం మంచి మిత్రులమే కానీ, రాజకీయాలు వేరంటూ.. సినిమాల్లో కలిసి నటించిన తాము రాజకీయాల్లో కలిసే సాగే అవకాశం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా కమల్ హాసన్ ఫిబ్రవరి 21న రామేశ్వరంలో పార్టీ పేరును ప్రకటించనున్నారు.