TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దూకుడు పెంచిన కవిత.. కేసీఆర్ కు టీఆర్ఎస్ లోకి ఆహ్వానం!

Published on: Thu Jun 18, 2026 10:48AM

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్న కల్వకుంట్ల కవిత.. దూకుడు పెంచారు.  తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును తన పార్టీ తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) లోకి రావలసిందిగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచీ.. ఆ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్న కవిత ఇప్పుడు ఒక  అడుగు ముందుకు వేసి  తన తండ్రి కెసిఆర్‌ను టీఆర్ఎస్ లోకి రావాల్సిందిగా బంపరాఫర్ ఇచ్చారు.  ఇటీవల ఒక జాతీయ టీవీ చానల్ కు కవిత ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వస్తే తిరిగి సొంత గూటికి వెడతారా అన్న ప్రశ్రకు ఆమె భావోద్వేగంగా స్పందించారు.  

బిఆర్ఎస్ పార్టీ నుండి తనను పంపించేటప్పుడు ఎదుర్కొన్న అవమానాలను గుర్తు చేస్తూ.. ఒక జీవిత కాలానికి సరిపడా అవమానాలను  అక్కడ భరించానన్నారు. ఆ పార్టీలోకి మళ్లీ వెళ్లే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టిన కవిత..  ఒకవేళ కెసిఆర్  స్వయంగా తన దగ్గరకు వస్తే.. తాను బిఆర్ఎస్‌లోకి వెళ్లడం కంటే, ఆయననే తన  పార్టీ తెలంగాణ రక్షణ సమితి  లో చేరాలని కోరతానన్నారు.

కవిత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో ఆమె పలుమార్లు తన తండ్రి చుట్టూ దయ్యాలు చేరాయని పరోక్షంగా హరీష్ రావు తదితరులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడి కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించడం  కవిత..  రాజకీయ పరిణతి చాటుకున్నారు.