TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కవిత కేసు.. ఆ పేపర్లకి ఏమైంది?

Published on: Thu Sep 26, 2024 2:28PM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జిషీట్‌పై విచారణను రౌస్‌ అవెన్యూ కోర్టు అక్టోబర్ 4కు వాయిదా వేసింది. ఈ కేసులు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా ఐదుగురిపై అభియోగాలతో సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చార్జిషేట్ పై న్యాయమూర్తి బుధవారం విచారణ జరిపారు.  చార్జిషీట్ లో కొన్ని పేజీలు సవ్యంగా లేవంటూ కవిత తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవిస్తూ చార్జిషీట్ ను సరైన పద్ధతిలో ఫైల్ చేసి కాపీ అందజేయాలేని సీబీఐని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం విచారణకు అక్టోబర్ 4కు వాయిదా వేశారు.