TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాళేశ్వర్ పేరిట రూ. 20 కోట్ల బీమా పాలసీలు

Published on: Sat Mar 17, 2012 2:07PM

అనంతపురం జిల్లా పెనుకొం డకు చెందిన సాయి కాళేశ్వర్ పేరిట సుమారు రూ. 20 కోట్ల విలువైన బీమా పాలసీలు ఉన్నట్లు తెలిసింది. ఆయన రెండేళ్ళుగా అస్వస్తతతో ఉన్నారు. అప్పటినుంచే ఆయన వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి పాలసీలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇప్పుడు ఇన్సురెన్స్ కంపెనీలు కాళేశ్వర కుటుంబానికి కోట్లాది రూపాయలు బీమా మొత్తాలను పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఈ కంపెనీల అధికారులు సాయి కాళేశ్వర్ మృతివెనుక ఆరోగ్యపరమైన కారణాలే కాక మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న అంశంపై విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కాళేశ్వర్ మల్టీ ఆర్గాన్ డిజార్డర్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. దీనికి తోడు ఆయనపై మావోయిస్టులతో సహా వివిధ వర్గాల నుంచి డబ్బుకోసం వత్తిళ్ళు వస్తుండేవని, దీంతో ఆయన మానసికంగా వేదనకు గురయ్యేవారని స్థానికులు చెబుతున్నారు. కాళేశ్వర్ పలుమార్లు ఆశ్రమం నుంచి బయటకు వచ్చి ఒంటరిగా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని కంటతడి పెట్టేవారని స్థానికుల స్వారా తెలుస్తోంది.