కళానికేతన్‌లో భారీ కుంభకోణం.. ఎండీ అరెస్ట్

దక్షిణ భారతదేశంలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కళానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.98 కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలను లీలాకుమార్ చెల్లించలేదన్న అభియోగంపై ఆయన్ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కళానికేతన్ డైరెక్టర్ల ఆస్తులను బ్యాంకుల్లో తనఖా పెట్టి, బ్యాంకు రుణాలు పొందాడు లీలాకుమార్..అనంతరం వారికి తెలియకుండా వారి ఆస్తులను విక్రయించాడు. కొత్త షాపులు తెరుస్తామంటూ కాస్మోస్ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నాడు..ఆ తర్వాత తీసుకున్న రుణం, రుణానికి వడ్డీ చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.