TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎల్.ఎన్.జి. ప్రాజెక్టుల్లో కార్తిక్ రెడ్డికి వాటా? జివోల విడుదలకు సబితాఇంద్రారెడ్డి పైరవీలు?

Published on: Sat Mar 24, 2012 12:41PM

అమెరికాకు చెందిన వి.జి.ఎస్. గ్రూప్ కాకినాడ తీరంలో సుమారు 1900 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలోని వ్యాపార సంస్థల భాగస్వామ్యంతో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్.ఎన్.జి.) ప్రాజెక్టును నెలకొల్పబోతోంది. ఈ ప్రాజెక్టుపై వి.జి.ఎస్. సంస్థ గత జనవరిలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన పత్రంపై సంతకాలు కూడా చేసింది. ఎక్కడో ఉన్న అమెరికాకు మన ప్రక్కనే ఉన్న కాకినాడకు లింకేమిటని తెలుగువన్.కామ్ ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు బైట పడ్డాయి. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర హోంశాఖ మంత్రిసబితాఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి బినామీ పేర్లతో వాటాదారుడిగా ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు పనులు సమన్వయ పర్చడానికి వి.జి.ఎస్. సంస్థ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యాలయానికి హోం మంత్రి ఆమె కుమారుడు సహాయ సహకారాలు అందించారు. అక్కడ ఇప్పటికే తమకు నమ్మకస్తులైన సిబ్బంది నియమించారు.

 

 

అంతేకాక కాకినాడలో ఎల్.ఎన్.జి. ప్రాజెక్టుకు అవసరమైన జీ.వో.ల జారీ విషయంలో సబితాఇంద్రారెడ్డి చొరవ తీసుకుని పని చేస్తున్నారు. దీని ఏర్పాటుకు అవసరమైన మూడు జీవోల కోసం ఆమె ముఖ్యమంత్రిని కలుసుకుని అవి విడుదల అయ్యేలా చూశారు. చిన్నచిన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి అల్లరైపోయే బదులు ఒక మెగా వెంచర్ లో పెట్టుబడులు పెడితే మంచిదన్న అభిప్రాయంతో కార్తిక్ రెడ్డి ఎల్.ఎన్.జి. ప్రాజెక్టులో వాటా దారుడిగా చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం మనకు లభ్యమవుతున్న సహజవాయువు కన్నా తక్కువ ధరకే ఎల్.ఎన్.జి. లభిస్తుంది. సహజవాయువును అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ద్రవీకరించడం వల్ల దీని పరిమాణం బాగా తగ్గిపోతుంది. అందువల్ల ఎక్కువ వాయువును అతి తక్కువ ధరతో బల్క్ వెస్సెల్స్ ద్వారా ఎక్కడికైనా చేరవేయవచ్చు. దీని సరఫరాకు పైప్ లైన్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎల్.ఎన్.జి.కు మన దేశంలో మంచి మార్కెట్ వుంది. కాకినాడలో ఏర్పాటు చేయబోయే ప్లాంట్లో సహజవాయువును ఎల్.ఎన్.జి. గా మార్చి నిల్వ చేస్తారు. అక్కడనుంచి మిగిలిన ప్రాంతాలకు పంపుతారు.