కాకినాడ కార్పొరేషన్ కబ్జాయత్నం.. హైకోర్టు సంచలన తీర్పు.!
Published on: Thu Jul 30, 2026 5:15AM
15 కోట్ల రూపాయల విలువైన కార్పొరేషన్ స్థలాన్ని అప్పనంగా కొట్టేయడానికి పక్కా స్కెచ్ వేసి.. కోర్టునే బురిడీ కొట్టించడానికి చేసిన ప్రయత్నంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ కబ్జా ప్రయత్నానికి హైకోర్టు చెక్ పెట్టింది. వివరాల్లోకి వెడితే.. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన భూమిపై కొందరు కబ్జాదారుల కన్ను వేశారు. సాధారణంగా భూకబ్జాదారులు పేపర్లు మర్చేస్తారు, లేదా బెదరింపులకు దిగుతారు. కానీ కాకినాడ కార్పొరేషన్ భూమి కబ్జా కోసం నిందితులు వ్యవస్థలోని లొసుగులు ఆసరా చేసుకుని, న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవపట్టించి కోట్లాది రూపాయల భూమిని, అదీ ప్రజోపయోగం కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జాచేసి తన ఖాతాలో వేసుకోవాలని చూశారు. న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించి, వ్యవస్థలోని లొసుగులను వాడుకుని, దాదాపు 15 కోట్ల విలువైన ప్రజా ఆస్తిని తమ ఖాతాలో వేసుకోవాలని చూశారు.
కాకినాడ రమణయ్యపేటలోని 700 గజాల స్థలాన్ని అక్రమంగా దక్కించుకునేందుకు కోర్టును తప్పుదోవ పట్టించే ఈ ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు అడ్డుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందుకు వచ్చినప్పుడు, ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ కుట్ర వెనుక ఎవరెవరున్నారన్నది తేలాల్సిందే అని స్ఫష్టం చేస్తూ ఐజీ స్థాయి ఉన్నతాధికారితో సమగ్ర విచారణ జరపాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశిస్తూ సంచలన తీర్పునిచ్చింది! ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యాయవాదులు న్యాయస్థానానికి సహకరించే అధికారులనీ, వారి మీద న్యాయవ్యవస్థకు అపారమైన విశ్వాసం ఉంటుందని గుర్తుచేశారు. అయితే అటువంటి వారే ఈ కేసు విషయంలో కుమ్మక్కు, ద్వంద్వ ప్రాతినిధ్యం, కోర్టును మోసం చేసే చర్యలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్నారు.
ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు కూడా బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ఒక వైపు అధికార యంత్రాంగం, మరోవైపు పక్కాగా వేసిన లీగల్ స్కెచ్... వీటిన్నింటినీ ఛేదించి, అసలు సూత్రధారులు ఎవరో తేల్చేందుకు ఏసీబీ ఇప్పుడు రంగంలోకి దిగింది.
Kakinada Land Scam, AP High Court, ACB Investigation, Kakinada Municipal Corporation, AP News, Land Grab Lawsuit, Andhra Pradesh High Court Order


