TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చేసిన పాపాలకు కాకాణి శిక్ష అనుభవించాల్సిందే!

Published on: Mon May 26, 2025 3:37PM

 

గత వైసిపి పాలనలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కన్నూమిన్నూ  కానకుండా  వ్యవహరించి చేసిన పాపాలకు శిక్ష అనుభవించి తీరాల్సిందేనని మాజీ మంత్రి, సర్వేపల్ల ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కాకాణి అరెస్టు తరువాత సోమవారం (మే 26) సోమిరెడ్డి పొదలకూరులో మీడియాతో మాట్లాడారు. అధికారం అండ చూసుకుని సోమిరెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని సోమిరెడ్డి విమర్శించారు.  

వైసిపి పాలనలో తప్పుడు కేసులు పెట్టి టిడిపి నాయకులు, కార్యకర్తలను జైలు పాలు చేశారనీ, ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులు కూడా జైలుకు పంపిన దుర్మార్గుడని అన్నారు.  కాకాణి వేధింపులకు  తాళలేక పొలాలు బీళ్లు  పెట్టుకుని ఊర్లు వదిలి భార్యాబిడ్డలకు దూరంగా  కాలం గడిపిన వారున్నారని చెప్పారు. అధికారం అండతో, అహంభావంతో తప్పుడు పనులు చేసిన కాకాణి ఇప్పుడు ఆ పాపాలకు, తప్పులకు శిక్ష అనుభవించాల్సిన సమయం వచ్చిందని సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నారు.