TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాకాణికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ముందస్తు బెయిల్ నిరాకరణ

Published on: Fri May 16, 2025 2:56PM

 

క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితరాలపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఆయనపై  ఫిబ్రవరిలో కేసు నమోదైంది. కాకాణి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గతంలో ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. మాజీ మంత్రి కాకాణి   కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

క్వార్జ్ కేసులో రెండు నెలలుగా కాకాణి తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్, బెంగళూర్‌లో నెల్లూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాకాణి బంధువుల ఇళ్లు, ఫాంహౌజ్‌లలో గాలిస్తున్నారు. మరోవైపు క్వార్జ్ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్వార్జ్ కేసులో మాజీ మంత్రి కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ సాగిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రజ అనే మహిళ అకౌంట్‌లోకి భారీ ఎత్తున కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్స్‌ జరిగినట్లు గుర్తించారు. 

ఆమె ఇంటికి కూడా పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె నోటీసులు తీసుకోకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అలాగే ఈ కేసులో 12 మందిని పోలీసులు గుర్తించారు. అందులో కాకాణి అల్లుడు కూడా ఉన్నారు. వీరందరికీ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా.. వారు లేకపోవడంతో ఇంటి గోడలకు నోటీసులు అంటించి వస్తున్నారు. రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చాక వారు స్పందించకపోతే వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.