ఈ అమ్మడికి మంచోడు కావాలంట...!

posted on: Jan 28, 2014 9:11AM

 

కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ ఇటీవలే పెళ్లి చేసుకుంది. అప్పటి నుండి కాజల్ ను "మరి నీ పెళ్ళెప్పుడు?" అని అడుగుతున్నారట. అయితే ఇదే విషయాన్ని మీడియా కూడా అడిగితే.. కాజల్ మాట్లాడుతూ... "నచ్చిన వ్యక్తి దొరికేవరకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే రాదు. ప్రస్తుతం నా మనసు ఖాళీ. ఓ మంచి అబ్బాయి దొరికితే ఖచ్చితంగా వెంటనే పెళ్లి కబురు వినిపిస్తాను. ప్రస్తుతం వృత్తిపరంగా బిజీగా ఉన్నాను. ఇంకా రెండు, మూడేళ్ళ వరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. ఎవరైనా నా మనసుకు నచ్చితే చెప్పలేను" అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...