TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాజల్‌ కాదంటోంది

Published on: Fri Aug 30, 2013 8:49AM

 

వరుస సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ రేంజ్ అందుకున్న అందాల భామ ఇప్పుడు తెలుగు సినిమాను పట్టించుకోవటంలేదు. తనకు వరుస అవకాశాలతో పాటు భారీ స్టార్ స్టేటస్ అందించిన టాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు నో అంటుందీ ముద్దుగుమ్మ కాజల్‌. లక్ష్మి కళ్యాణం తో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించి అందాల భామ కాజల్. ‘మగధీర ’ సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకున్న ఈ భామ తరువాత టాప్ రేంజ్ లో దూసుకుపోవడమే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది.

అయితే తనకు  ఇంతటి రేంజ్  తెచ్చి పెట్టిన టాలీవుడ్ ని చిన్న చూపు చూస్తుంది కాజల్ అగర్వాల్. బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తుండటంతో ఇక్కడ సినిమాలు కాదంటుంది.  తెలుగుకు నో చెప్పుతున్న ఈ అమ్మడు కోలీవుడ్ లో మాత్రం సినిమాలు అంగీకరిస్తుంది. తనకు స్టార్ స్టేటస్ ఇచ్చిన టాలీవుడ్ని కాదని కోలీవుడ్ సినిమాలు చేయటం ఏంటని అడిగితే ఇక్కడ అడిగినంత పేమెంట్ ఇవ్వటం లేదని నిర్మొహమాటంగా చెప్తుందిట కాజల్.

బాలీవుడ్ లో మాత్రం ఎంత అడిగితే అంత ఇస్తున్నారని చెబుతుంది. అంతేకాదు డబ్బుల కోసం కోలీవుడ్లో ఎలాంటి స్టార్ స్టేటస్లేని తన కంటే జూనియర్ అయిన ఉదయ నిధి స్టాలిస్ సరసన కూడా హీరోయిన్గా ఒప్పేసుకుంది.టాలీవుడ్ దర్శక నిర్మాతలు సినిమాలతో సంప్రదించినా దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ అడుగుతుందట. దీంతో గడప దాకా వచ్చిన ఆఫర్లు కూడా వెనక్కి వెల్లిపోతున్నాయట. ఇప్పటికే పవన్, రామ్ చరణ్, బాలక్రిష్ణ, నాగ చైతన్య లాంటి స్టార్ సినిమాల కాదన్న కాజల్ కు ఇక తెలుగులో అవకాశాలు

రావడం కూడా కష్టం అవటున్నారు సినీ విశ్లేషకులు.