Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాజల్ ఇంట్లో పెళ్లి సందడి
posted on: Dec 18, 2013 9:14AM

కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ ఇటీవలే ప్రేమలో పడి, నిశ్చితార్థం కూడా చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈనెల 28న నిషా అగర్వాల్ పెళ్లి కరణ్ పలేచాతో జరగబోతోంది. ఈ సందర్భంగా కాజల్ పెళ్లి భాధ్యతలను దగ్గరుండి మరీ చూసుకుంటుంది. " నా కళ్ల ముందే పెరిగిన నా చిన్నారి చెల్లెలు తన జీవిత భాగస్వామిని ఎన్నుకునేంత ఎత్తుకు ఎదిగినందుకు సంతోషంగా ఉంది. తన సంతోషమే మా సంతోషం. ఈ 28న ముంబయ్‌లో వివాహ వేడుక జరగనుంది. మాకో "ఎమోషనల్ డే" అది. మా ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది. పెళ్లి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. చెల్లెలి పెళ్లికి సంబంధించిన పనులను దగ్గరుండి చేయడం ఓ కొత్త అనుభూతినిస్తోంది. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి నేనూ నా చెల్లెలు సినిమాలు చేస్తున్నాం. ఇక్కడివాళ్లు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. అలాగే, నా చెల్లెలి జీవితం బాగుండాలని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా" అని చాలా ఎమోషనల్ అంటుంది.






