TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నవరస నటనా వైభవం కైకాల సత్యనారాయణ

Published on: Fri Dec 23, 2022 11:04AM

సీనియర్ నటుడు, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తదితరులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు చిత్రసీమకే కాక యావత్ తెలుగు వారికీ తీరని లోటని తమ సంతాప సందేశాలలో పేర్కొన్నారు.

 నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల  హీరో, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆహార్యం, అభినయం, ఆంగికాల కలబోత కైకాల సత్యనారాయణ అని పేర్కొన్నారు. సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ణాశాలి కైకాల మరణం చిత్రపరిశ్రమకే కాదు, మొత్తం తెలుగు వారందరికీ తీరని లోటని బాలకృష్ణ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

   తెలుగుసినీ వినీలాకాశం ఒకగొప్ప ధ్రువతారను కోల్పోయిందన్నారు. ఎన్టీఆర్ వంటి మహానుభావుడితో కలిసి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కైకాల చూపి న అభినయం ఎన్నటికీ మరువలేనిది. సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థి స్తూ, వారి కుటుంబసభ్యులకు, వారి అభిమానులకు నాప్రగాఢ సానుభూతి తెలియచేస్తు న్నానని పేర్కొన్నారు.

మెగా స్టార్ చిరంజీవి కూడా కైకాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటనలో అన్ని రసాలను అలవోకగా పలికించగల  అద్భుత నటుడు కైకాల అని చిరంజీవి పేర్కొన్నారు.  వ్యక్తి అని, నిష్కల్మషమైన మనసున్న మనిషి సత్యనారాయణ అని చిరంజీవి తన సంతాప సందేశంలో పేర్కన్నారు.  . తనను తమ్ముడూ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారని పేర్కొన్నారు.