హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులకు కంగనా సవాల్
Published on: Sun Jan 30, 2022 3:54PM
బాలీవుడ్ డేరింగ్ నటి కంగనా రనౌత్ మానవ హక్కుల కార్యకర్తల మీద ఫైరయ్యారు. అహ్మదాబాద్ కు చెందిన కిషన్ భార్వాడ్ అనే యువకుణ్ని స్థానిక ముస్లిం యువకులు దారుణంగా కాల్చి చంపితే హ్యూమన్ యాక్టివిస్టులు ఎక్కడ పోయారని ప్రశ్నించారు. జనవరి 25 వ తేదీన కిషన్ అనే 27 ఏళ్ల యువకుణ్ని ఇద్దరు దుండగులు బైక్ మీద వచ్చి కాల్చి చంపారు. అంతకుముందు కిషన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టింగులతో ముస్లిం కమ్యూనిటీ నుంచి ఆందోళన పెల్లుబుకింది. ఆ పోస్టును డిలీట్ చేయాలని, పోస్టు పెట్టినందుకు క్షమాపణ పెట్టాలని కూడా స్థానిక మసీదు మౌల్వీలు డిమాండ్ చేశారు. దీంతో కిషన్ ఆ పోస్టింగ్ పై క్షమాపణ కోరినా ఎందుకు చంపాల్సి వచ్చిందని కంగనా ప్రశ్నించారు. హ్యూమన్ యాక్టివిస్టులు కేవలం సెలక్టివ్ ఇష్యూలను మాత్రమే ఎంచుకోవడం, సెలక్టివ్ మతాలకు మాత్రమే వత్తాసు పలకడం ఏంటని ప్రశ్నించారు. వారు కిషన్ ను, హిందువులను మనుషులుగా చూడటం లేదా అంటూ చురకలంటించారు. కిషన్ కు రెండేళ్ల కూతురు కూడా ఉంది. ఈ ఘటనలో ఇద్దరు స్థానిక మసీదు మౌల్వీల హస్తం ఉందని, వారి ప్రేరేపించడం వల్లే ముస్లిం యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. నలుగురిలో ఇప్పటికి ఇద్దరిని అరెస్టు చేశామని, మరో ఇద్దర్ని అరెస్టు చేస్తామని అహ్మదాబాద్ పోలీసులు అంటున్నారు.


