TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కడియంకు కాంగ్రెస్ అండ?

Published on: Fri Mar 16, 2012 3:40PM

స్టేషన్ ఘన్ పూర్ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కడియం శ్రీహరికి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. గత రెండు రోజులుగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హడావిడి తగ్గగా టిడిపి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మొదట ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటిస్తారని అంతా భావించారు. అనుహ్యంగా ఆయన పర్యటన రద్దయింది. ప్రచార బాధ్యతలు భుజాన పెట్టుకున్న మంత్రులు పొన్నాల లక్ష్మయ్య బసవరాజు సారయ్యల జాడ పెద్దగా కనిపించలేదు. మరోవైపు కాంగ్రెస్, టిడిపిల మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే కిరణ్కుమార్ రెడ్డి పర్యటన ఇక్కడ రద్దయిందని తెలంగాణా నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఇక్కడ తాము గట్టి పోటీనిస్తే టిఆర్ఎస్ కు లభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే తమ ప్రచార జోరును తగ్గించి కదియంకు బలం చేకూర్చేవిధంగా వ్యవహరిస్తే ఆయన టిఆర్ఎస్ అభ్యర్ధికి గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని స్థానిక నాయకులు భావిస్తున్నారు.