సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం

 

 kadiyam sri hari, telangana kadiyam sri hari, kcr yatra telangana

 

 

సీమాంద్ర లో జరుగుతున్నది కృత్రిమ ఉద్యమమని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్ మీద సీమాంధ్ర నేతలు నానా రభస చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని అభిప్రాయపడ్డారు. పదేళ్ల ఉమ్మడి రాజధానికి సుముఖం అని ఆంటోని కమిటీకి తెలిపారని, హైదరాబాద్ మీద తెలంగాణ ప్రజలకు పూర్తి హక్కులు ఉంటాయని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డిలో సీమాంధ్రలో జరుగుతున్న కృత్రిమ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారని, తెలంగాణలో జనాలను రోడ్డు మీదకు ఎక్కకుండా అడ్డుకున్న వీరంతా సీమాంధ్రలో సోనియా చిత్రపటాలు తగలబెడుతున్నా, ఇందిరా, రాజీవ్ విగ్రహాలు కూల్చుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. సీమాంధ్రలో జరుగుతున్నది రాజకీయ అధికారం కోసం జరుగుతున్న పోరాటం అని విమర్శించారు.

 


తెలంగాణ రాష్ట్ర విభజన ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వర్షాకాల సమావేశాలలోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి పెంచేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలోని పది జిల్లాల పర్యటనకు సిద్దమవుతున్నారు. కరీంనగర్ నుండి ప్రారంభమయ్యే ఈ యాత్రలు తెలంగాణ అంతటా నిర్వహిస్తారు.