TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ దీక్ష..హరీష్ రావు హౌస్ అరెస్టు

Published on: Tue Jan 10, 2012 10:22AM

నిజామాబాద్: కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం నుంచి నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో చేపట్టనున్న రైతు దీక్షను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీష్ రావును ముందు జాగ్రత్తగా పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. హరీష్ రావు హౌస్ అరెస్టు వార్తను తెలుసుకున్న తెరాస శ్రేణులు, తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. దీనిపై తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఒక సీమాంధ్ర పెట్టుబడి నాయకుడి పర్యటన కోసం తెలంగాణ ఉద్యమకారుడైన ఎమ్మెల్యే హరీష్‌రావును హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలకు ప్రభుత్వం స్వస్తి చెప్పి తక్షణం హరీష్‌ రావును విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.