TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ కోటకు బీటలు: తెలుగుదేశం బలుపా, వాపా: కడప మేయర్, పులివెందుల చైర్ పర్సన్ గెలుపే గీటురాయి.!

Published on: Wed Oct 28, 2026 4:28PM

దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికీ, వైసీపీకీ, జగన్ కీ పెట్టని కోటగా నిలిచిన కడప కోట బీటలు వారింది. కడప గడపలో వైపీపీ పట్టు కోల్పోయింది. స్థానిక సమరంలో మెజారిటీ స్థానాలలో కనీసం నామినేషన్ కూడా వేయలేని దయనీయ స్థితిలో నిలిచింది.  స్థానిక సమరంలో కడప జిల్లా లో వైసీపీ చేతులెత్తేసింది.  రాజంపేట, బద్వేల్, ప్రొద్దుటూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, మైదుకూరు వంటి కీలక ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవ విజయాలు సాధించారు. అన్నిటికీ మించి జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోనూ వైసీపీ చతికిల బడింది.

పులివెందుల మునిసిపాలిటీలో సగానికి పైగా వార్డులను తెలుగుదేశం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పులివెందులలోనే వైసీపీకి అభ్యర్థులు కరవయ్యారని ఈ పరిణామం తేటతెల్లం చేసింది.   దశాబ్దాలుగా వైసీపీ కుటుంబం ఆధిపత్యం కొనసాగిన పులివెందులలోజగన్ పార్టీ తరఫున అభ్యర్థులు కూడా లేని పరిస్థితిని ఏర్పడడాన్ని బట్టి ఆ పార్టీ దయనీయ స్థితి కళ్లకు కడుతుంది. ఈ ఏకగ్రీవాలతో వైపీపీ కడపలో వెనకడుగు వేసిందని తేటతెల్లమైౌతోంది. అయితే ఇక్కడ వైసీపీపి తెలుగుదేశం పై చేయి సాధించినా, దీనిని నిజమైన విజయంగా భావించి సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎదుటి పక్షం అంటే వైసీపీ చేతులెత్తేయడం వల్ల పోటీ లేకుండా వచ్చిన విజయాలివి. అందుకే వీటిని సాంకేతిక విజయాలుగానే తెలుగుదేశం భావించాల్సి ఉంటుంది.  క్షేత్రస్థాయిలో కూటమి నాయకులు సమన్వయంతో వ్యవహరించడం, వ్యూహాత్మక సాగడం వల్లే ఇది సాధ్యమైంది. గతంలో వైకాపా ఏకపక్షంగా గెలుపొందిన ప్రాంతాల్లోనూ ఇప్పుడు కూటమి పార్టీలు బలాన్ని చాటింది. 

అది పక్కన పెడితే ఏకగ్రీవాల కారణంగా వైసీపీ.. తెలుగుదేశం అధికార బలంతో తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని ఆరోపణలు గుప్పిస్తోంది. వాస్తవానికి ప్రజా మద్దతు లేకపోవడం వల్లనే వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. లేకుంటే పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.  అయితే పరిశీలకులు మాత్రం గతంలో అంటే జగన్ అధికారంలో ఉండగా స్థానిక ఎన్నికలలో ఏకగ్రీవాలలో రికార్డు సృష్టించారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయడానికి వీలులేని పరిస్థితులను సృష్టించడం ద్వారా ఆ రికార్డు సాధించారు. ఇప్పుడు తెలుగుదేశం జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లు అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ప్రస్తుతం కడప కార్పొరేషన్  మేయర్, పులివెందుల మున్సిపాల్  చైర్ పర్సన్ స్థానాలకు జరిగే ప్రత్యక్ష పోలింగ్‌లోనే అసలైన ఓటర్ల తీర్పు తేలనుంది. ఇంకా ఓటింగ్ జరగాల్సిన కడప మేయర్, పులివెందుల మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఓట్ల రూపంలో విజయం సాధిస్తేనే, ఈ ఏకగ్రీవాలకు సార్థకత చేకూరుతుంది. ఆ స్థానాలను గెలుచుకోలేని పక్షంలో లేనిపక్షంలో, కేవలం నామినేషన్ల ఉపసంహరణలు, రాజకీయ ఒత్తిళ్ల మధ్య జరిగిన ఏకగ్రీవ విజయాలు వాపే కానీ బలుపు కావని పరిశీలకులు అంటున్నారు.

ఏది ఏమైనా కడప పరిణామాలు వైసీపీ అధినేత జగన్ మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. ఈ ఏకగ్రీవలు వైసీపీ శ్రేణులలో కూడా నిరుత్సాహాన్నీ, నిస్తేజాన్నీ నింపుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే కడప మేయర్, పులివెందుల చైర్ పర్సన్ స్థానాలలో విజయం సాధిస్తేనే ఈ ఏకగ్రీవాలకు సార్ధకత, ఈ విజయాలకు గుర్తింపు లభిస్తుందని పరిశీలకులు అంటున్నారు. అంత వరకూ కడపలో   నిజంగా వైసీపీ నుంచి తెలుగుదేశానికి ఓటు బ్యాంకు బదలీ అయ్యిందని చెప్పడానికి అవకావాలు లేవు. 

[Kadapa Local Body Elections, TDP Unanimous Wins, Y CP Bastion Pulivendula, Andhra Pradesh Politics, TeluguOne News]