TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'దేశం' గూటిలోకి పసుపులేటి

Published on: Wed Mar 28, 2012 11:20AM

కడపజిల్లాకు చెందిన మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించి పార్టీకి దూరమయ్యారు. ఆ తరువాత ఏ పార్టీలోనూ చేరే ప్రయత్నం ఆయన చేయలేదు. కాని త్వరలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగబోతుండటంతో ఆయన మరోసారి తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే పసుపులేటి బ్రహ్మయ్య ఇటీవల హైదరాబాద్ లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసుకున్నట్లు తెలిసింది. రాజంపేట దేశం టిక్కెట్ ను తనకు కేటాయించాలని ఆయన ఈ సందర్భంగా కోరినట్లు తెలిసింది. కానీ ఇప్పటికే ఈ టిక్కెట్ కోసం టిడిపి సీనియర్ నాయకుడు మోదుగల పెంచయ్య, ట్రాన్స్ ఫార్మర్ శ్రీనివాసులు, తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు పత్తిపాటి కుసుమకుమారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరందరినీ కాదని బ్రహ్మయ్యకు టిక్కెట్ ఇచ్చే సాహసం చంద్రబాబునాయుడు చేయలేరని పార్టీవర్గాలు అంటున్నాయి. అందుకే చంద్రబాబునాయుడు తనను కలుసుకున్న బ్రహ్మయ్యకు ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిసింది.