TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెయిల్ కు బ్రహ్మణి ఉక్కుకర్మాగారం

Published on: Wed Mar 28, 2012 11:51AM

కడపజిల్లాలో నిర్మించతలపెట్టిన బ్రహ్మణి ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటి ఆఫ్ ఇండియా (సెయిల్)కు అప్పగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది. నిజానికి బ్రహ్మణి ఉక్కు కర్మాగారాన్ని గాలి జనార్ధనరెడ్డి ప్రారంభించాల్సి ఉంది. దీని నిర్మాణానికి 2007 అక్టోబర్ 6న శంఖుస్థాపన కుడా జరిగాయి. ఈ కర్మాగారం పేరిట గాలి జనార్ధనరెడ్డి లక్షలాది టన్నుల ఇనుప ఖనిజాన్ని తవ్వి విదేశాలకు ఎగుమతిచేసి కోట్లాది రూపాయలు ఆర్జించాడు. శంఖుస్థాపన అనంతరం 18 నెలల్లో పరిశ్రమ మొదటి దశ పూర్తవుతుందని అప్పట్లో గాలి జనార్ధనరెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడంతో బ్రహ్మణి ఉక్కు కర్మాగారం భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. ఈ కర్మాగారాన్ని నిర్మిస్తే రాయలసీమ ప్రాంతంలో వందలాది మందికి ఉపాధి లభిస్తుంది. దీనికి అవసరమైన ముడిఖనిజాన్ని సరఫరా చేయడానికి గనులు కూడా కేటాయించారు. స్థానిక ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వమే దీనిని నిర్మించాలని చాలాకాలం నుంచి కోరుతున్నారు. దీంతో కేంద్ర స్పందించి ప్రాజెక్టు చేపట్టవలసిందిగా స్టీల్ అథారిటి ఆఫ్ ఇండియాను ఆదేశించినట్లు తెలిసింది.