Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అరుదైన పుట్ట గొడుగు...బరువు 1.3 కిలోలు
posted on: Jun 16, 2025 4:50PM

వైయస్సార్ కడప జిల్లాలో అరుదైన పుట్టగొడుగు కనిపించింది. పుట్టగొడుగులు మామూలుగా అయితే దాని బరువు 50 గ్రాములులేదా మహా అంటే వంద గ్రాముల లోపే ఉంటాయి. అయితే ఇక్కడ లభించిన ఈ పుట్టగొడుగు ఏకంగా1.3 కిలోలు తూగింది. పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం గోటూరులో ఈ పుట్టగొడుగు లభ్యమైంది. ఆ గ్రామానికి చెందిన గంగాధర్ అనే రైతు పొలంలో ఈ అరుదైన పుట్టగొడుగు కనిపించింది. దీనిని "అల్లం పుట్టగొడుగు"గా పిలుస్తారని స్థానిక రైతులు తెలిపారు. ఈ పుట్టగొడుగు లభ్యం కావడంతో దాని ఆసక్తికరంగా పరిశీలించారు.






