TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డ్రైవర్ల సమ్మెతో నిలిచి పోయిన అద్దె బస్సులు

Published on: Wed Oct 8, 2025 6:57PM

 

 

కడప జిల్లా దవ్వూరులో ఆళ్లగడ్డ డిపో  డ్రైవర్ పై ప్రయాణీకుడి దాడికి నిరసనగా  కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోని ఆర్టీసీ డిపోలలో విధులు నిర్వహించే ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు సమ్మె నిర్వహించారు. దీంతో ప్రయాణీకులు బస్సు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  ఈ సందర్బంగా పలువురు ఆర్టీసీ  అద్దె బస్సు డ్రైవర్లు మాట్లాడుతూ ఆళ్లగడ్డ  ఆర్టీసీ డిపోకు చెందిన అద్దె బస్సు ఆళ్లగడ్డ నుంచి మైదుకూరుకు బయలు దేరిందన్నారు. మార్గమద్యంలో 120 మంది ప్యాసింజర్లు వున్న బస్సు ఆపలేదన్నారు. దీంతో  దువ్వూరు వద్ద కడపకు చెందిన హేమవర్థన్ తన కుటుంబ సభ్యులతో కలసి బస్సులో వున్న డ్రైవర్ పై దాడికి పాల్పడడంతో తల పగిలిందన్నారు. 

బస్సులో పరిమితికి మంచి ప్రయాణీకులను ఎక్కించుకున్నా కూడ బస్సు ఆపలేదని  డ్రైవర్ ను క్రిందకు లాగి కొట్టారన్నారు. ఈ విధంగాఇష్టాను సారంగా ప్రయత్నిస్తున్నారన్నారు.  డ్యూటీ చేయాలంటే కష్టతరంగా వుందన్నారు. అదే విధంగా ప్రయాణీకులు ఎక్కపడితే అక్కడ ఆపటం చేస్తున్నారన్నారు. ఒక ఊరికి ఒక స్టేజ్ కాకుండా ఇంటి దగ్గర ఆపుకుంటున్నారన్నారు.  ప్యాసింజర్స్ కు కండక్టర్ సపోర్టు చేసి డ్రైవర్ పై రెచ్చగొట్టిస్తున్నారన్నారు. తమ పై జరుగుతున్న దాడులను అరికట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేక పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 పరిమితి మంచి ప్యాసింజర్లను ఎక్కించటం ఆపాలని, ఇష్టాను సారంగా ఎక్కడ పడితే అక్కడ ఆపటం సరికాదన్నారు. అద్దె బస్సు డ్రైవర్స్ అంటే అధికారులకు చులకనగా వుంటోందన్నారు. తమ పై ప్యాసింజర్స్ వల్ల ఎటువంటి సమస్య జరిగినా అధికారులు పరిష్కరించాలని వారు ఆర్టీసీ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.  ఈ విషయమై స్పందించిన రాష్ర్ట రవాణశాఖ మంత్రి మండిపల్లి రాంప్రాసద్ రెడ్డి ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సమస్యలను పరిష్కరించి ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.