కడప ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మికం
Published on: Mon Apr 9, 2012 3:23PM
కడపజిల్లా:రాష్ట్రం మొత్తంగా జరిగే ఉప ఎన్నికలు ఒక ఎత్తు అయితే కడప ఉప ఎన్నికలు ఒక ఎత్తుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడమే ఇందుకు కారణం. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన కొత్తలో కడప జిల్లా మొత్తంగా కాంగ్రెస్ నేతలందరూ జగన్ మోహనరెడ్డి వర్గంలోకి వస్తారని భావించిన చివరికి ముగ్గురు శాసన సభ్యులతో సర్దుకోవాల్సి వచ్చింది. రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు నియోజక వర్గాలకు చెందిన శాసన సభ్యులు మాత్రమే జగన్ వర్గంలో చివరివరకు నిలిచి పదవులు కోల్పోయారు. ప్రస్తుతం ఆ మూడు నియోజకవర్గాలలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. మూడింటిలో కనీసం ఒక స్టానంలో అయినా గెలవాలనే తలంపుతో కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందుకుగాను ముఖ్యమంత్రి కిరణ్ ఇప్పటి నుంచే పూర్తిస్తాయిలో ఎత్తుగడలతో ముందుకు వస్తున్నారు. ప్రాధమిక సమాచారాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్దులను కూడా నిర్ణయించినట్టు తెలిసింది. అందిన సమాచారాన్ని బట్టి కాంగ్రెస్ ప్రతీ తరుపున రాజంపేట నియోజకవర్గానికి మల్లిఖార్జున రెడ్డి, రాయచోటి స్టానానికి రాంప్రసాదరెడ్డి, రైల్వేకోడూరు స్టానానికి కనపర్తి ఈశ్వరావు పోటీకిదించే అవకాశం వుంది. పులివెందుల ఉప ఎన్నిక సందర్బంగా జరిగిన లోపాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.


