నిబంధనలకు పాతరేస్తున్న మంత్రి సి.రామచంద్రయ్య
Published on: Mon Feb 27, 2012 3:13PM
కడప
జిల్లా: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు మంత్రి తలుచుకుంటే కానిపని ఏముంటుంది. కడప జిల్లాలో ఇదే జరిగింది. ఇటీవల పవిత్రమైన దేవాదాయశాఖ మంత్రిత్వ పదవిని పొందిన సి.రామచంద్రయ్య అపవిత్రంగా నిబంధనలను పాతరేశారు. తన సామాజిక వర్గానికి చెందిన విజయభాస్కర్ ను రూపరామ్ పేట శివానందస్వామి దేవాలయం ఛైర్మన్ గా నియమించారు. ఎలాంటి నోటిఫికేషన్, దరఖాస్తు లేకుండానే ఆఘమేఘాల మీద విజయభాస్కర్ ను దేవస్థానం ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత తన అనుచరుడు సాంబశివారెడ్డిని ఛైర్మన్ గా నియమించాలని ఎమ్మెల్యే కమలమ్మ ప్రతిపాదించారు. మంత్రి జోక్యంతో ఆమె బెంబేలెత్తారు. చివరకు మంత్రి ప్రతిపాదనల మేరకు సాంబశివారెడ్డికి మద్దతు పలికారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నగాక మొన్నవచ్చిన పీఆర్పీ నాయకుల పెత్తనం ఏమిటి, వారికి పదవులు ఇవ్వటం ఏమిటని పలువురు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.


