TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజంపేట దేశం అభ్యర్థిపై వీడని సస్పెన్స్

Published on: Mon Mar 19, 2012 12:17PM

కడపజిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్థి ఎవరనే విషయంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేయడానికి బ్రహ్మయ్య ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అయితే ఆయన ఇంతవరకు టిడిపి సభ్యత్వం తీసుకోలేదు. నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రం మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి పోటీచేయాలని పట్టుబడుతున్నారు. దీనిపై మదన్ మోహన్ రెడ్డి తన అభిప్రాయాన్ని ఇంతవరకు వెల్లడించలేదు. అభ్యర్థి ఎవరైనా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి 65 వేల ఓట్లు పోలవుతాయని కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. అయితే మదన్ మోహన్ రెడ్డి పోటీ చేస్తే కనీసం 15 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని కార్యకర్తలు అంటున్నారు. కార్యకర్తలు ఎంత పట్టుబడుతున్నప్పటికీ మదన్ మోహన్ రెడ్డి తన అంగీకారం తెలపకపోవడంతో వారు నిరాశకు గురవుతున్నారు.