TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజంపేటలో ఎన్నికల సందడి

Published on: Mon Mar 19, 2012 11:43AM

కడపజిల్లా రాజంపేటలో ఉప ఎన్నికల సందడి మొదలైంది. ఈ నియోజకవర్గంలో ప్రధాన ఓటు బ్యాంకుగా వున్న ఎస్సీ, మైనారిటి, బిసి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు నానా తంటాలుపడుతున్నారు. ఈ నియోజకవర్గంలోని రాజంపేట, నందలూరు, సుండుపల్లె, వీరవల్లి, వంటిమిట్ట, సిద్దవటం మండలాల్లో కులాలవారీగా ఓటర్ల గణనకు అన్ని పార్టీలు శ్రీకారం చుడుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారు. ఇక్కడ 1,78,897 ఓట్లు ఉండగా ఇందులో పురుషులకు 86,197 ఓట్లు, స్త్రీలకు 92,700 ఓట్లు ఉన్నాయి. ఎస్టీలు సుమారు 10 వేల మంది ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అమరనాథ్ రెడ్డికి 60 వేల ఓట్లు రాగా, తెలుగుదేశం అభ్యర్థి మదన మోహన్ రెడ్డికి 48 వేల ఓట్లు వచ్చాయి. బలిజ సామాజికవర్గానికి చెందిన గునిపాటి రామయ్యకు 21, 4999 ఓట్లు, కమ్మ సామాజికవర్గానికి చెందిన రమేష్ నాయుడుకు 1,827 ఓట్లు, యాదవ కులానికి చెందిన చాట చంద్రశేఖర్ కు 1,061 ఓట్లు వచ్చాయి. గత అనుభవాల దృష్ట్యా కుల నాయకులను తమవైపు తిప్పుకోవడం ద్వారా ఓట్లు రాబట్టుకోవచ్చుననే ఉద్దేశ్యంతో ఆయా పార్టీల నేతలు ఉన్నారు.