దేశంలో తొలిసారిగా ప్రభుత్వ స్కూలులో స్మార్ట్ కిచెన్
Published on: Tue Sep 2, 2025 3:14PM
.webp)
దేశంలోనే తొలిసారిగా కడప జిల్లా సికె దిన్నె ఎంపీపీ హైస్కూలులో అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్‌ను రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. సికె దిన్నె స్మార్ట్ కిచెన్ నుంచి 1787 మంది విద్యార్థులకు భోజనం తయారీ, పంపిణీ చేశారు. కమలాపురం నియోజక వర్గంలో 2, జమ్మలమడుగు 2, కడపకు చెందిన ఒక స్మార్ట్ కిచెన్‌ను వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ 5 స్మార్ట్ కిచెన్ల ద్వారా 136 పాఠశాలల్లోని 10,323 మందికి శుచికరమైన భోజనం తయారీ, ప్రత్యేక వాహనాల ద్వారా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ డిసెంబర్ నాటికి జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 33 అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ ప్రారంభిస్తామన్నారు. కడప జిల్లాలో 33 స్మార్ట్ కిచెన్ల ద్వారా 1,24,689 మంది విద్యార్థులకు రుచి, శుచితో కూడిన భోజనం అందిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.అంతకుముందు నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్ కి తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.


