పోసానికి బెయిలు.. కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ డిస్మిస్
Published on: Fri Mar 7, 2025 2:54PM

పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. అన్నమయ్య జిల్లా ఓబులవారి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజురు చేసింది. కూటమినేతలు పవన్ కళ్యాణ్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో ఓబులావారి పల్లి పోలీసులు పోసానిని గత నెలలో హైద్రాబాద్ లో అరెస్ట్ చేసి రాజంపేట జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. నరసరావు పేట పోలీసులు పీటీ వారెంట్ తో పోసానికి అక్కడ అదుపులోనికి తీసుకుని అక్కడ్నుంచి గుంటూరు జైలుకు తరలించారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టటణంలోని ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోసానిపై నమోదైన కేసులో పీటీ వారంట్ తో అదుపులోనికి తీసుకుని పోలీసులు గుంటూరు నుంచి కర్నూలు తరలించారు. వీటిలో ఓబులాపురంలో నమోదైన కేసులో కడప కోర్టు పోసానికి బెయిలు మంజూరు చేసింది. పోసానిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.


