TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అడ్డగోలు దోపిడీకి అధికార పార్టీ నేతల ఆరాటం

Published on: Tue Feb 28, 2012 3:41PM

కడప జిల్లా: దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలనే ఆలోచనలో కడప జిల్లాలో అధికారి పార్టీ నేతలు ఉన్నారు. అవసరమైతే అడ్డగోలుదారుల్లో అక్రమార్జనకు ఆ పార్టీ నేతలు ఆరాటపడుతున్నారు. ఉపాధి హమీ నిధులపై కన్నెసి అందినకాడికి దోచుకునే ప్రయత్నంలో ఉన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అండదండలతో ఆయన అనుచర గణం మహాత్మాగంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద విడుదలవుతున్న నిధులను స్వాహా చేయడానికి రంగం సిద్ధం చేశారు. కడప జిల్లా కరపు కోరల్లో చిక్కుకోవడంతో రైతులు, రైతు కూలీలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం జిల్లాకు రూ.32 కోట్ల నిధులను కేటాయించింది. జీవో నెంబర్ 129 మేరకు గ్రామాల మధ్య అనుసంధానం చేసే రోడ్లు ఏర్పాటు చేయాలి. జీవో నెంబర్ 389 ప్రకారం ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి. నిబంధనల ప్రకారం పనులు నిర్వహించాల్సిన జిల్లా యంత్రాంగం అధికార పార్టీ ఆగడాలను నియంత్రించలేకపోతుంది. ఇప్పటికే ఉన్న రోడ్లను నూతనంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదనలు పంపితే అధికారులు గుడ్డిగా ఆమోదించాల్సి వస్తోంది. జీవో నెంబర్ 129 మేరకు గ్రామాల మధ్య కనెక్టివిటీ రోడ్లు (లింకు రోడ్లు) ఏర్పాటుచేయాలి. ఇక్కడ కూడా మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఆదేశాలను యధాతథంగా అమలు చేస్తున్నారు. ఇదివరకే ఉన్న మెటల్ రోడ్లను ఫార్మెషన్ రోడ్లుగా మార్చేస్తున్నారు. ఈ ప్రక్రియవల్ల మెటల్ రోడ్డుపై కాస్త మట్టిచాల్లి ఫార్మెషన్ రోడ్డు పేరుతో నిధులు స్వాహాచేయడానికి రంగం సిద్దమైంది.