TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డిఎల్ ని కిరణ్ ఒంటరిని చేయనున్నారా?

Published on: Sat Feb 11, 2012 12:57PM

కడప: డిఎల్ రవీంద్రా రెడ్డి ని  ఒంటరిని చేసే వ్యూహం లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వున్నారా? కడప జిల్లా సమావేశాన్ని తిరుపతిలో నిర్వహిస్తున్న తీరుచూస్తుంటే అవుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెసుకు సంబంధించి కడప జిల్లాలో ముఖ్య నాయకుడు డిఎల్ రవీంద్రా రెడ్డే. ఎవరూ ముందుకు రాని సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై కడప ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కాంగ్రెసు నుంచి డిఎల్ రవీంద్రా రెడ్డి ముందుకు వచ్చారు. ఇప్పడు మళ్లీ ఉపఎన్నికలు వస్తున్నాయి. ఈ స్థితిలో కడప జిల్లా ఉప ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసేందుకు తిరుపతిలో శనివారం భేటీకి డిఎల్ రవీంద్రా రెడ్డిని దూరం పెట్టారు. సీఎం కిరణ్ నేతృత్వం వహించనున్న ఈ సమావేశంలో పాల్గొనేందుకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుపతికి బయలుదేరగా, డీఎల్ ఊసే ఎక్కడా వినిపించడం లేదు. కడపపై సమావేశాన్ని తిరుపతిలో పెట్టడం ఏమిటని ఇప్పటికే డీఎల్ ప్రశ్నించారు. తిరుపతిలో పెడితే రాబోనని ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అయినా, తిరుపతినే వేదికగా చేసుకోవడం వెనక ఆయనను పట్టించుకోవడం లేదని అర్ధమవుతున్నది. శాఖలో కోత పెట్టినందుకు కిరణ్‌పై బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్న డీఎల్‌ను సొంత జిల్లాలోనే ఏకాకిని చేసేందుకే ఇలాచేస్తున్నారా అని రాజకీయవర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.