TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

డాక్ట‌ర్ దుస్తుల్లో ఉగ్ర‌వాదులు..

Published on: Wed Mar 8, 2017 5:33PM


ఉగ్ర‌వాదులు మాన‌వ విలువ‌ల‌ను మంట‌గ‌లిపార‌ని ఆ దేశాధ్య‌క్షుడు అష్ర‌ఫ్ ఘ‌నీ తెలిపారు. స‌ర్దార్ హాస్ప‌ట‌ల్‌లో మొత్తం 400 ప‌డ‌క‌లు ఉన్నాయి. హాస్ప‌ట‌ల్‌పై దాడి చేయ‌డ‌మంటే అది దేశం మీద దాడి చేయ‌డ‌మే అని ప్రెసిడెంట్ అన్నారు. మొన్న‌టి వ‌ర‌కు తాలిబ‌న్ల దాడుల‌తో ఉక్కిరిబిక్కిరి అయిన ఆఫ్ఘ‌నిస్తాన్‌కు ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ సెగ కూడా తాకింది. ఇవాళ దాడికి దిగిన మిలిటెంట్ల‌లో ఒక‌రు హాస్ప‌ట‌ల్ గేటు వ‌ద్దే పేల్చుకున్నాడు. హాస్ప‌ట‌ల్ కాంపౌండ్‌లోకి ఎంట‌ర్ అయిన ఉగ్ర‌వాదులు రెండ‌వ‌, మూడ‌వ అంత‌స్తుల్లోకి చొర‌బ‌డిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. డాక్ట‌ర్ దుస్తుల్లో ఉన్న జిహ‌దీ త‌న చేతుల్లో ఉన్న ఏకే 47 గ‌న్‌తో విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రుపుతున్నాడ‌ని హాస్ప‌ట‌ల్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ ఓ వ్య‌క్తి చెప్పాడు. దీంతో ఉగ్ర‌వాదుల‌ను వేటాడేందుకు భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు.