TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కాబూల్ లో ఆత్మాహుతి దాడి కలకలం....

Published on: Wed Mar 8, 2017 3:11PM

 

కాబూల్ లో తరచూ ఆత్మహుతి దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆత్మాహుతి దాడి కలకలం రేపింది. వివరాల ప్రకారం.. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఆర్మీ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు ఆర్మీ సిబ్బంది అడ్డుకుంటున్నా దూసుకొచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు ఆర్మీ ఆసుపత్రి ప్రధాన ద్వారం దగ్గర తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో ఆత్మాహుతి దాడి సభ్యుడికి బ్యాకప్ ఇచ్చిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టబెట్టాయి. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేతికే పనిలో పడ్డారు.