TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మైదానంలోనే మరణించిన కబడ్డీ క్రీడాకారుడు.. తమిళనాడులో విషాదం

Published on: Thu Jul 28, 2022 11:07AM

తమిళనాడులో జరిగిన ఓ విషాదం అచ్చం ఒక తెలుగు సినిమాలా ఉంది. భీమిలీ కబడ్డీ జట్టు అనే సినిమాలో హీరో కబ్బడ్డీ క్రీడాకారుడు. ఒక టోర్నమెంటులో ఆడుతూ మైదానంలోనే మరణిస్తాడు. మరణించే ముందు కూడా ప్రత్యర్థి క్రీడాకారుడిని టాకిల్ చేయడం ద్వారా తన జట్టుకు విజయాన్ని అందిస్తారు.  

తమిళనాడులో జిల్లా స్థాయి క్రీడా పోటీలలో కూడా అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది. క్రీడా మైదానంలో ఒక్క సారిగా విషాదం అలుము కుంది. అప్పటి వరకూ పోటా పోటీగా సాగుతున్న ఆట, మైదానంలో క్రీడాకారులను ఉత్సాహ పరుస్తున్న ప్రేక్షకులు ఒక్క సారిగా మూగవోయారు. ఒక్కసారిగా విషాదం అలుముకుంది.

తమిళనాడు కడలూరు జిల్లా కడం పులియార్లో జిల్లా స్థాయి కబబ్డీ పోటీలు జరుగుతుండగా విమల్ రాజ్ అనే బీఎస్సీ సెకండియర్ విద్యార్థి ప్రత్యర్థి క్రీడాకారుడిని టాకిల్చేస్తూ గాయపడి మైదానంలోనే కుప్పకూలి మరణించాడు.

 సేలంలోని  ప్రైవేటు కాలేజీలో బీఎస్సీ సెకండియర్ విద్యార్థి విమల్ రాజ్  జిల్లా స్థాయి కబడ్డీ  పోటీల్లో భాగంగా  ప్రత్యర్థి జట్టు ఆటగాడిని టాకిల్ చేస్తున్న సమయంలో ఆ క్రీడాకారుడి మోకాలు బలంగా తాకింది. దీంతో వెంటనే కందపడిపోయిన విమల్ రాజ్ పైకి లేవడానికి ప్రయత్నించి సాధ్యం కాక కింద పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే అతడిని  ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.  విమల్ రాజ్ మరణంతో ఈ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది.