కాబా శానిటైజ్‌ ప్రక్రియలో 3,500 మంది కార్మికులు

3,500 మంది కార్మికులతో గ్రాండ్‌ మాస్క్‌ మక్కాలో క్లీనింగ్‌ ఆపరేషన్‌ జరుగుతోంది. జనరల్‌ ప్రెసిడెన్సీ ఫర్‌ ఎఫైర్స్‌ ఆఫ్‌ టూ హోలీ మాస్క్స్‌, కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ బృహత్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. 2,160 లీటర్ల ఎకో ఫ్రెండ్లీ శానిటైజేషన్‌ సొల్యూషన్‌ని 89 పీస్‌ల ఎక్విప్‌మెంట్‌ని రోజువారీ ఆరు క్లీనింగ్‌ ఆపరేషన్స్‌ని ఈ హోలీ సైట్‌లో చేపడుతున్నారు. ప్రతి ఐదు రోజులకోసారి కార్పెట్స్‌ని క్లీన్‌ చేస్తున్నారు.

విజిటర్స్‌ సేఫ్టీ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. 13,500 పెద్ద ప్రేయర్‌ రగ్గుల్ని ఎప్పటికప్పుడు వాష్‌ చేసి, స్టెరిలైజ్‌ చేస్తున్నామని హోలీ మాస్క్‌ క్లీనింగ్‌ అండ్‌ కార్పెట్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జబెర్‌ విదాని చెప్పారు.

జూలై చివరలో జ‌రిగే హజ్‌ యాత్రకు సంబంధించి సౌదీ ప్ర‌భుత్వం ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు.