TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో పిటిషన్ వేసిన కేఏ పాల్

Published on: Wed Feb 10, 2021 5:00PM

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఏపీలో ఆందోళనలు ఉధృతమౌతున్న సంగతి తెల్సిందే. తాజాగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేఏ పాల్‌ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారంటూ అయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్రం డిజిన్వెస్ట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తోందని... ఇలా చేయకుండా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పాల్‌ తన పిటిషన్‌ ద్వారా హైకోర్టును కోరారు.

అంతేకాకుండా విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా కలసిరావాలని అయన కోరారు. ఈ అంశంపై సీఎం జగన్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పాల్ డిమాండ్ చేశారు.