TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది బదిలీ.. ఆయన స్థానంలో?

Published on: Thu Jun 13, 2019 11:53AM

 

ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి కావేటి విజయానంద్‌ను నియమిస్తూ ఈరోజు  ఉత్తర్వులు జారీ చేసింది. విజయానంద్ నియామక ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రస్తుతం  విజయానంద్‌ ఏపీ జెన్‌కో సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఆయన 1992లో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ సబ్‌ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి సహా పలు అధికారిక పదవుల్లో సేవలందించారు.