సుప్రీంకోర్టు సీజేగా దత్తు?

 

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా కర్నాటకకు చెందిన హంద్యాల లక్ష్మీనారాయణ దత్తు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు బుధవారం మీడియా కథనాలు వెలువడ్డాయి. సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా హెచ్‌ఎల్ దత్తు పేరును సిఫార్సు చేస్తూ ఓ ఫైలును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి పంపినట్టుగా ఈ కథనాలను సమాచారం. ప్రస్తుతం లక్ష్మీనారాయణ దత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వున్నారు. ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎమ్.లోధా ఈనెల 27న పదవీ విరమణ చేయగానే ఆయన స్థానంలో దత్తు నియమితులవుతారు.