TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కావాలనుకుంటే నన్ను జైలుకు పంపండి...

Published on: Fri Mar 31, 2017 3:20PM


కోర్టు ధిక్కార కేసులో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్నన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ కేసులో భాగంగా ఆయనకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి కూడా విదితమే. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట ఈ రోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యాలు చేశారు. తాను ఉగ్రవాదిని గానీ, అసాంఘిక శక్తిని గానీ కానని, అంతగా కావాలనుకుంటే ధర్మాసనం తనను జైలుకు కూడా పంపుకోవచ్చని... తన పాలనాపరమైన, న్యాయపరమైన పనిని ఫిబ్రవరి నెలలో ఏకపక్షంగా లాగేసుకున్నందున దాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. అయితే, ఆయనకు కలకత్తా హైకోర్టులో మళ్లీ విధులు అప్పగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నాలుగు వారాల్లోగా సమాధానం సమర్పించాలని ఆదేశించింది. ఆయన మానసిక స్థఙతి ఏమీ బాగోలేదని, అందువల్ల ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.