TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూనియర్ ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదం.. నిజమేనా?

Published on: Wed Aug 14, 2024 3:20PM

జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వార్తలొస్తున్నాయి. మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ప్రమాదం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారని న్యూస్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే వార్తలతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఎన్టీఆర్ కి రోడ్డు ప్రమాదం అనే వార్తల్లో వాస్తవం లేదని ఆయన టీం తెలిపింది. "ఇటీవల జిమ్‌లో వర్కౌట్స్  చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ ఎడమ మణికట్టు బెణికింది. గాయపడినప్పటికీ ఎన్టీఆర్ గత రాత్రి దేవర షూటింగ్ పూర్తి చేశారు. అది చిన్న గాయమే.. ఎవరూ ఆందోళన చెందవద్దు" అని టీం పేర్కొంది.